అద్భుతం.. నీటిని ఆకాశానికి ఎత్తుకెళ్లిన సుడిగుండం
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో సుడిగుండం స్థానికులను కనువిందు చేసింది. గత కొన్ని రోజులుగా ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. జిల్లా పరిధిలోని దేవ్రి డ్యామ్ వద్ద తీవ్రంగా ఈదురుగాలులు వీస్తున్న సమయంలో.. డ్యామ్ నీటిలో ఒక్కసారిగా సుడిగుండం ఏర్పడింది. డ్యామ్‌లో ఉన్న నీటిని అమాంతం ఆకాశానికి ఎత్తుకెళ్లినట్టు సుడిగుండం ఏర్పడడంతో అక్కడే ఉన్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ దృశ్యాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో సుడిగుండం స్థానికులను కనువిందు చేసింది. గత కొన్ని రోజులుగా ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. జిల్లా పరిధిలోని దేవ్రి డ్యామ్ వద్ద తీవ్రంగా ఈదురుగాలులు వీస్తున్న సమయంలో.. డ్యామ్ నీటిలో ఒక్కసారిగా సుడిగుండం ఏర్పడింది. డ్యామ్‌లో ఉన్న నీటిని అమాంతం ఆకాశానికి ఎత్తుకెళ్లినట్టు సుడిగుండం ఏర్పడడంతో అక్కడే ఉన్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
#MadhyaPradesh | A waterspout was seen at Devri dam in Sidhi district on Monday, attracting a lot of visitors from local villages. pic.twitter.com/4WNOt2R2xN
— NDTV (@ndtv) September 1, 2021