గృహిణి నుంచి సైనికురాలిగా..
ఏడాది కిందట తన భర్త దేనికోసం ప్రాణ త్యాగం చేశాడో.. నేడు అదే యూనిఫామ్ ధరించేందుకు ఆమె సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు..పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ మేజర్ విభూతి దౌండియాల్ భార్య నిఖితా కౌల్ దౌండియాల్. ఆమె ఇటీవలే ‘ఎస్ఎస్‌సీ’ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసి, ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఆర్మీ సర్వీసెస్‌లో చేరాలనుకునే యుద్ధంలో వితంతువులైన మహిళలకు ఆర్మీ వయోపరిమితిని సడలించింది. కానీ మిగతా ఎంపిక ప్రకియ మాత్రం ఇతరుల మాదిరే […]
ఏడాది కిందట తన భర్త దేనికోసం ప్రాణ త్యాగం చేశాడో.. నేడు అదే యూనిఫామ్ ధరించేందుకు ఆమె సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు..పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ మేజర్ విభూతి దౌండియాల్ భార్య నిఖితా కౌల్ దౌండియాల్. ఆమె ఇటీవలే ‘ఎస్ఎస్‌సీ’ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసి, ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఆర్మీ సర్వీసెస్‌లో చేరాలనుకునే యుద్ధంలో వితంతువులైన మహిళలకు ఆర్మీ వయోపరిమితిని సడలించింది. కానీ మిగతా ఎంపిక ప్రకియ మాత్రం ఇతరుల మాదిరే కఠినతరంగానే ఉన్నందున అర్హత సాధించేందుకు నిఖితా కౌల్ తీవ్రంగానే శ్రమించింది. ఏడాదిపాటు ఉండనున్న శిక్షణలోనూ రాణించాలని, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ అధికారిగా ఎదగాలని అనుకుంటోంది. ప్రస్తుతం నోయిడాలోని ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నిఖితా..తొందరలోనే చైన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరనుంది.