KIMS ఆసుపత్రిలో ‘నగ్నంగా’ కొవిడ్ పేషెంట్స్.. అసలు ఏం జరుగుతోంది.?

దిశ, వెబ్‌డెస్క్ : ఒడిషాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయూర్ భంజ్‌లోని కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఒంటిపై బట్టలు లేకుండా నేల మీద పడుకున్నారు. మరి కొందరు ఏకంగా టాయిలెట్ల పక్కనే బట్టలు లేకుండా నిద్రపోతున్న ఫోటోలు, వీడియోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియలో ఈ ఫోటోలు, వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ స్పందించారు. అత్యవసర విచారణకు ఆదేశించినట్టు […]

Update: 2021-06-01 01:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒడిషాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయూర్ భంజ్‌లోని కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఒంటిపై బట్టలు లేకుండా నేల మీద పడుకున్నారు. మరి కొందరు ఏకంగా టాయిలెట్ల పక్కనే బట్టలు లేకుండా నిద్రపోతున్న ఫోటోలు, వీడియోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియలో ఈ ఫోటోలు, వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ స్పందించారు. అత్యవసర విచారణకు ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

వివరాల ప్రకారం.. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో.. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగులకు ఆసుపత్రి సిబ్బంది బెడ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా ఓ కరోనా బాధితుడిని కలిసేందుకు ఆయను బంధువు ఆసుపత్రికి వెళ్లగా.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డు చేశారు.

అయితే ఈ ఘటనపై మయూర్ భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ స్పందిస్తూ తనకేమీ తెలియదని చెప్పుకురావడం విమర్శలకు దారి తీస్తున్నది. కాగా.. ఆసుపత్రి తీరుపై, అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఫైర్ అవుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Tags:    

Similar News