కడుపులో బంగారు ఉంగరాలు.. షాక్‌లో డాక్టర్లు

దిశ, వెబ్ డెస్క్ : ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన శిబు అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనెక్కడ పోలీసులకు దొరుకుతానో అని భయపడి ఐస్ క్రీమ్‌తోపాటు 35 గ్రాముల బంగారాన్ని మింగేశాడు. ఈ విచిత్రమైన ఘటన దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద […]

Update: 2021-06-01 03:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన శిబు అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనెక్కడ పోలీసులకు దొరుకుతానో అని భయపడి ఐస్ క్రీమ్‌తోపాటు 35 గ్రాముల బంగారాన్ని మింగేశాడు. ఈ విచిత్రమైన ఘటన దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పోలీసులకు ఆధారలు దొరకకూడదని దొంగిలించిన ఉంగరాలను శిబు మింగేశాడు. కాసేపటికి అతనికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే శిబును పరీక్షించి, స్కానింగ్ తీయగా అతని కడుపులో బంగారు ఉంగారాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తర్వాత శస్త్రచికిత్స చేసి బంగారు ఉంగరాలను బయటకు తీశారు. దొంగతం కేసులో పోలీసులకు దొరకకూడదనే తాను బంగారు ఉంగారాలు మింగినట్టు తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News