‘మట్కా మ్యాన్’‌‌ను సూపర్ హీరోగా కీర్తించిన మహీంద్రా!

దిశ, ఫీచర్స్ : తాగునీటిని పొందడం మానవ ప్రాథమిక హక్కు. కానీ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ హక్కును పొందలేరు. భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల మాదిరి మెట్రోలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక వృద్ధుడు దక్షిణ ఢిల్లీలోని నిరుపేదల దాహార్తిని తీర్చడాన్ని తన ధ్యేయంగా మార్చుకుని ఆదర్శంగా నిలిచాడు. అంతేకాదు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అతడి వీడియోను ఆనంద్ పంచుకోగా.. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ […]

Update: 2021-10-26 09:41 GMT

దిశ, ఫీచర్స్ : తాగునీటిని పొందడం మానవ ప్రాథమిక హక్కు. కానీ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ హక్కును పొందలేరు. భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల మాదిరి మెట్రోలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక వృద్ధుడు దక్షిణ ఢిల్లీలోని నిరుపేదల దాహార్తిని తీర్చడాన్ని తన ధ్యేయంగా మార్చుకుని ఆదర్శంగా నిలిచాడు. అంతేకాదు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అతడి వీడియోను ఆనంద్ పంచుకోగా.. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వాటర్ మ్యాన్ ఎవరంటే?

దక్షిణ ఢిల్లీ నివాసియైన 72 ఏళ్ల అలగ్‌ నటరాజన్‌.. నాలుగు దశాబ్దాల పాటు ఇంగ్లండ్‌‌లో జీవించి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యాడు. రిటైర్‌మెంట్ తర్వాత పేగు క్యాన్సర్‌ను ఓడించి ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చిన నటరాజన్.. ఏదైనా మంచి పని కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘జీవితంలో మన ప్రధాన లక్ష్యం ఇతరులకు సాయం చేయడమే. మీరు సాయం చేయలేకపోతే, కనీసం వారిని బాధపెట్టవద్దు’ అనే లైఫ్ ఫిలాసఫీని నమ్మే ఓల్డ్ మ్యాన్.. ఈ మేరకు పేద ప్రజల ఆకలి దప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తన పెన్షన్, జీవిత పొదుపుతో పాటు శ్రేయోభిలాషుల నుంచి అందిన విరాళాలతో రెండు ట్రక్కులు కొనుగోలు చేసి వాటర్ ట్యాంకులు, ప్యూరిఫికేషన్ యంత్రాల కోసం మాడిఫై చేయించాడు. వీటి ద్వారా దక్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తూ ‘మట్కా మ్యాన్’గా ప్రసిద్ధి చెందాడు. ఈ క్రమంలోనే ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించడం విశేషం. ఈ నేపథ్యంలోనే నటరాజన్‌ను కీర్తిస్తూ ట్వీట్ చేసిన మహీంద్రా ‘మార్వెల్ కంటే శక్తివంతమైన సూపర్ హీరో ఆ మట్కామాన్. అతను ఇంగ్లండ్‌లో ఒక వ్యవస్థాపకుడు, పేదలకు నిశ్శబ్దంగా సేవ చేయడానికి భారత్‌కు తిరిగొచ్చిన క్యాన్సర్ విజేత. సామాజిక సేవ కోసం మా బొలెరో వాహనాన్ని వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు.

‘మట్కా మ్యాన్’ ఢిల్లీలో ప్రసిద్ధి చెందినప్పటికీ, మహీంద్రా ట్వీట్ వైరల్ కావడంతో అతని సర్వీస్ ఎక్కువమందిని ఆకర్షించింది. దేశం నలుమూలల నుంచి ప్రజలు అతని దయ, ఆలోచనాత్మకమైన పనికి సెల్యూట్ చేస్తున్నారు. కొందరు తనను స్ఫూర్తిగా తీసుకుంటామని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు అతనికి మద్దతిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

నా చుట్టూ ఉన్న వారికి సాయం చేయాలని, వారి చుట్టూ ఉన్నవారికి సాయపడేందుకు ప్రజలను ప్రేరేపించాలని కోరుకుంటున్నా. అందుకోసమే దక్షిణ ఢిల్లీ పరిసరాల్లో 15 కంటే ఎక్కువ మట్కా స్టాండ్‌లను ఏర్పాటు చేశాను. వాటిపై నా వ్యక్తిగత టెలిఫోన్ నంబర్‌ ఉండటంతో మట్కా ఖాళీ అయితే వెంటనే ఫోన్ వస్తుంది. నీళ్లే కాదు నిర్మాణ కార్మికులు, లేబర్స్‌కు పంపిణీ చేయడానికి పోషకాహారంతో పాటు సలాడ్‌ను కూడా సిద్ధం చేస్తాను. వారానికోసారి చుట్టుపక్కల 5-6 నిర్మాణ స్థలాల్లోని సుమారు 150 మందికి ఆహారం అందిస్తాను.
– నటరాజన్

Tags:    

Similar News