దిశ ఎఫెక్ట్.. వివరాలు సేకరిస్తున్న ఎన్ఎస్పీ అధికారులు..

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇండ్లను కిరాయికి ఇస్తున్నారని దిశ దినపత్రికలో ఈనెల 15న 'కిరాయిలకు ఎన్ఎస్పీ ఇండ్లు' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

Update: 2024-11-19 09:35 GMT

దిశ, మిర్యాలగూడ : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇండ్లను కిరాయికి ఇస్తున్నారని దిశ దినపత్రికలో ఈనెల 15న 'కిరాయిలకు ఎన్ఎస్పీ ఇండ్లు' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఎన్ఎస్పీ అధికారులు నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన ఎన్ఎస్పీ ఇండ్లను మంగళవారం ఇంటింటి సర్వే చేపట్టారు.

ఎవరి పేరున అలాట్మెంట్ అయింది, ఎవరు ఇంట్లో ఉంటున్నారని వివరాలతో పాటు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కిరాయికి ఇస్తున్న వారి వివరాలను, అదనపు గదుల నిర్మాణం, నిరుపయోగం ఉన్న ఇండ్ల వివరాలను సేకరిస్తున్నారు. అలాట్మెంట్ ఒకరి పేరు మీద ఉండి ఇంకొకరికి ఇండ్లను కిరాయికిస్తున్న వారికి త్వరలోనే నోటీసులు అందజేయనున్నట్లు డీఈ జనార్ధన్ పేర్కొన్నారు.


Similar News