ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాలు..
ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాలు విజయవంతం చేయాలని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పిలుపునిచ్చారు.
దిశ, కార్వాన్ : ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాలు విజయవంతం చేయాలని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 తేదీ నుండి 24 తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం గ్రౌండ్ దగ్గర, ఐమాక్స్ థియేటర్ పక్కన చైర్మన్ సాయికుమార్ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉత్సవాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారని చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నట్లు మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.