ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూసేకరణ…

ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు

Update: 2024-11-19 11:22 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (ఎస్ హెచ్ 01)వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ (ఎన్ హెచ్ -44) వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ కోసం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టర్లు, సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన రెవెన్యూ గ్రామాల వారీగా భూసేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి,డిఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టర్లు, సర్వేయర్ లు తదితరులు పాల్గొన్నారు.


Similar News