BJP: రోడ్లపై ఇలాంటి చర్యలు అరికట్టండి.. పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ రిక్వెస్ట్

రోడ్లపై ఇలాంటి అనుమతిస్తే.. ఇతరులకు కూడా ఉదహరణగా నిలుస్తుందని, వీటిని తక్షణమే అరికట్టాలని గోషామహాల్(Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అన్నారు.

Update: 2024-11-19 10:46 GMT

దిశ, వెబ్ డెస్క్: రోడ్లపై ఇలాంటి అనుమతిస్తే.. ఇతరులకు కూడా ఉదహరణగా నిలుస్తుందని, వీటిని తక్షణమే అరికట్టాలని గోషామహాల్(Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అన్నారు. నవంబర్ 15 రోజున హైదరాబాద్(HYD) లోని దిల్‌సుఖ్‌నగర్(Dilsuk Nagar) లో రోడ్డుపై నమాజ్ చేస్తున్నారని తెలుపుతూ ట్విట్టర్ లో దీనికి సంబంధంచిన ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ రోడ్లపై ఇలాంటి అవాంతరాలను తక్షణమే అరికట్టాలని హైదరాబాద్ పోలీసులను(HYD City Police) కోరారు. అలాగే రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజలను అనుమతిస్తే, అది ఇతరులకు హనుమాన్ చాలీసా(Hanuman Chalisa)ను కూడా అందించడానికి దారితీసే ఒక ఉదాహరణగా నిలుస్తుందని సూచించారు.

మన వీధులను దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడాన్ని తాము అనుమతించలేమని స్పష్టం చేశారు. అంతేగాక ఇది సాధారణ ప్రజలకు అనవసరమైన ఆటంకాలు, అవాంతరాలను సృష్టిస్తుందని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరికీ రోడ్లు స్పష్టంగా, శాంతియుతంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే ఏ సమూహం కూడా ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఉంటే.. బహిరంగ ప్రదేశాలు ఏ ఆటంకాలు లేకుండా అవి ఉద్దేశించిన ప్రయోజనాలకు అందిస్తాయని బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) అన్నారు. 

Tags:    

Similar News