నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ.. ఆ అంశాలపైనే ఫోకస్!

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ మలిదశ విచారణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2025-04-24 03:45 GMT
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ.. ఆ అంశాలపైనే ఫోకస్!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ మలిదశ విచారణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫా విచారణలో భాగంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ (Justice Pinaki Chandra Ghosh) గత బీఆర్ఎస్ సర్కార్‌ (BRS Government)లో సదరు ప్రాజెక్టుల నిర్మాణాలకు బాధ్యులుగా వ్యహరించిన వారికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై మలిదశ విచారణలో ప్రధానంగా ఆరా తీయనున్నట్లుగా సమాచారం. అయితే, ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్‌ (Kaleshwaram Commission) గడువు ముగియనుండటంతో మరో రెండు నెలల వ్యవధితో గడువును పొడిగిస్తూ సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. 

Tags:    

Similar News