వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థినికి యువకుడు వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి.. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని […]

Update: 2020-12-19 22:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థినికి యువకుడు వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి.. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News