కరోనా.. తల్లి చివరి చూపునకు నోచుకోని కుమారుడు

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు కరోనా ఆందోళన కారణంగా తల్లి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే… ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్‌ బాలిన రామసుబ్బారావు కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంతో పాటు తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవలే ఇండియాకు వచ్చారు. అయితే ట్రావెట్ రికార్డు నిబంధనల కారణంగా స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్)లో ఉన్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి సుజాత హైదరాబాదులో […]

Update: 2020-03-30 07:05 GMT

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు కరోనా ఆందోళన కారణంగా తల్లి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే… ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్‌ బాలిన రామసుబ్బారావు కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంతో పాటు తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవలే ఇండియాకు వచ్చారు. అయితే ట్రావెట్ రికార్డు నిబంధనల కారణంగా స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్)లో ఉన్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి సుజాత హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

ఆమె మృతదేహాన్ని ఒంగోలులోని నివాసానికి తీసుకొచ్చారు. హోం క్వారంటైన్ నేపథ్యంలో సామాజిక బాధ్యతతో కనుచూపు మేరలో తల్లి మృతదేహం ఉన్నప్పటికీ కడసారి చూపుకు నోచుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె అంత్యక్రియలను వీడియోకాల్‌ ద్వారా వీక్షించడంతో సరిపెట్టుకున్నారు.

Tags:    

Similar News