సెకండ్ హ్యాండ్ పేరుతో గోల్‌మాల్
దిశ, ఖమ్మం టౌన్: సెకండ్ హ్యాండ్ షోరూం మాయజాలంతో వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో కస్టమర్ల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో సెకండ్ ద్విచక్రవాహన షోరూంలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర నుంచి వచ్చిన వ్యాపారులు ఖమ్మం నగరంలో రాజకీయ పలుకుపడి ఉన్న వారితో కలసి వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ షోరూంలకు ఎలాంటి అనుమతులు లేకుండా దోపిడీ దందాకు తెర లేవుతున్నారు. కొత్త వాహనాలు కొనుగొలు చేయలేని మధ్యతరగతి వారిని అవసరాన్ని అవకాశంగా తీసుకొని వాహనం […]
దిశ, ఖమ్మం టౌన్: సెకండ్ హ్యాండ్ షోరూం మాయజాలంతో వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో కస్టమర్ల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో సెకండ్ ద్విచక్రవాహన షోరూంలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర నుంచి వచ్చిన వ్యాపారులు ఖమ్మం నగరంలో రాజకీయ పలుకుపడి ఉన్న వారితో కలసి వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ షోరూంలకు ఎలాంటి అనుమతులు లేకుండా దోపిడీ దందాకు తెర లేవుతున్నారు. కొత్త వాహనాలు కొనుగొలు చేయలేని మధ్యతరగతి వారిని అవసరాన్ని అవకాశంగా తీసుకొని వాహనం పేరుతో పైనాన్స్ పేరుతో వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీల పేరుతో కస్టమర్లను దోచుకుంటున్నారు. పైనాన్స్ పేరును అడ్డం పెట్టుకొని తెల్లని కాగితలపై, ఖాళీ ప్రాంసరీ నోటులపై కొనుగోలుదారుల సంతకాలు తీసుకొని బెదిరింవులకు గురి చేస్తున్నారు. ఒకటి, రెండు, మూడు నెలలు కిస్తీలు ఆలస్యమ్తెతే షోరూం యజమానులు ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు, గ్యాంగ్‌లను పంపి బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా…
జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం ప్రాంతాలల్లోని సెకండ్ హ్యాండ్ షోరూం వాహనాలకు ఫైనాస్స్ కల్పిస్తామంటూ ఆడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారు. తమ వద్ద వాహనం కొనుగోలు చేసే వారికి స్పాట్ పైనాన్స్ కల్పిస్తామంటూ చెప్పి ఘరానా దోపిడీకి పాల్పడుతున్నారు. ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు కేవలం నామమాత్రవు అనుమతులు కలిగి ఉన్న ఈ పైనాన్స్ షోరూంలు స్లాట్ వడ్డీ పేరుతో వినియోగదారుల నడ్డీ విరుస్తున్నారు. వినియోగదారుడు మొదట చెల్లించే డౌన్ పేమెంట్ నగదును షోరూం నిర్వహకులు ఇచ్చే ఫైనాస్స్, డాక్యుమెంట్ చార్జీలు, ఇతర చార్జీలు కలిపి దాని లేవల్ చేస్తారు. ఇక నెల నెల కీస్తీలు కలిపి ప్రతి నెల ఈఎంఐ రూపంలో వస్తూలు చేస్తున్నారు. ఒక నెల ఈఎంఐ ఆల్యసంమైతే దానికి వడ్డీ కలువుతున్నారు. ఒక వేళ వినియోగదారుడు మూడు నెలల కీస్తీలు కట్టకపోతే వాహనాన్ని సీజ్ చేశారు. దానికి కూడా వినియోగదారుడు నుంచే నగదు వస్తూలు చేస్తున్నారు. అక్కడ ఫైనాస్స్‌పై వాహనం తీసుకుంటే ప్రతి నెల కీస్తీలు కట్టిన కూడా ఏదో కొర్రీలు పెట్టి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ షోరూం కేవలం ఒక్క ఫరం (సంస్థ) పేరుతో వీరు అనుమతులు పొంది జిల్లా వ్యాప్తంగా షోరూంలకు నిబంధనలకు విరుద్ధంగా పైనాన్స్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరు బయట మాత్రం తమ వద్ద ఆర్‌బీఐ నిబంధనలు ఉన్నాయి అని దానికి అనుగుణంగా పైనాన్స్ కల్పిస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారు.
పోలీస్ అధికారులు దృష్టి సారించాలి..
జిల్లాలో సెకండ్ హ్యాండ్ మాయపై పోలీసులు దృష్టి సారించాలని బాధితులు వేడుకుంటున్నారు. గతంలో ఈ సెకండ్ హ్యాండ్ మయాజాలంపై పోలీస్ అధికారులు అడ్డుకట్ట వేశారు. కొని ఏళ్ల తర్వాత జిల్లాలో షోరూం దందా మళ్లీ మెదలు పెట్టారు. ఆంధ్రకు చెందిన కొంత మంది వ్యాపారస్తులు స్థానికంగా రాజకీయ నాయకుల పలుకుపడి కొంత మందితో కలిసి షోరూంలు ఏర్పటు చేశారు. ఆంధ్ర వ్యాపారులు పెట్టుబడులతో దందాను మరింత విస్తరిస్తున్నారు. కుల సంఘాల నాయకులను ఆడ్డ పెట్టకొని కీస్తీలు కట్టని వాళ్లను బెదిరింవులు గురి చేస్తున్నారు. ఈ వ్యవహరంపై పోలీసులు దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని ఫైనాన్స్ బాధితులు కోరుతున్నారు.