పూజారి.. గుండెజారి.. దిగజారి!
దిశ, వెబ్‌డెస్క్: గుడిలో పువ్వులతో పూజలు, ఇంటి దగ్గర జాతకాలు చెప్పే పూజారి ఒక్కసారిగా ‘గుడి వెనక నాసామి’ క్యారెక్టర్‌ను పోషించాడు. రూట్ మార్చి రొమాంటిక్ రోల్‌కి వచ్చేశాడు. పూజారిగా ఎన్నో జంటలను ఒక్కటి చేసిన ఆయన, మొన్నటికి మొన్న తనదగ్గరికి వచ్చిన ఓ జంటను విడదీసి యువతిపై లుక్కేశాడు. మీ జాతకం బాగలేదని వేరే మ్యారేజ్‌చేసుకోవాలని యువకుడికి సలహా ఇచ్చాడు. ‘నీది మహర్జాతకం‘ అంటూ ఆ యువతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. నువ్వంటేనే ఇష్టం, కాదంటేనే […]
దిశ, వెబ్‌డెస్క్: గుడిలో పువ్వులతో పూజలు, ఇంటి దగ్గర జాతకాలు చెప్పే పూజారి ఒక్కసారిగా ‘గుడి వెనక నాసామి’ క్యారెక్టర్‌ను పోషించాడు. రూట్ మార్చి రొమాంటిక్ రోల్‌కి వచ్చేశాడు. పూజారిగా ఎన్నో జంటలను ఒక్కటి చేసిన ఆయన, మొన్నటికి మొన్న తనదగ్గరికి వచ్చిన ఓ జంటను విడదీసి యువతిపై లుక్కేశాడు. మీ జాతకం బాగలేదని వేరే మ్యారేజ్‌చేసుకోవాలని యువకుడికి సలహా ఇచ్చాడు. ‘నీది మహర్జాతకం‘ అంటూ ఆ యువతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. నువ్వంటేనే ఇష్టం, కాదంటేనే కష్టం అంటూ ఫోన్‌లో పోకిరి వేషాలేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌కాలనీకి చెందిన శరత్ అనే పూజారి స్థానికంగా జాతకాలు చెబుతూ ఉంటాడు. చాలామందికి ఇతనంటే ఓ నమ్మకం. అందుకే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసే సమయంలో ఆయనతో జాతకాలు చెప్పించుకుంటారు. ఈ క్రమంలోనే మొన్న ఓ ప్రేమజంట వచ్చి పూజారిని తమ జాతకాలు చూడాలని కోరింది. అప్పటివరకు అందరితో రాముడు మంచి బాలుడి క్యారక్టర్‌లా కనిపించిన ఆ పూజారి యువతి అందానికి ఫిదా అయిపోయి, ఎలాగైనా జంటను విడదీసి ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మీ జాతకాలు సరిగా లేవని చెప్పి పంపాడు. మళ్లీ యువకుడికి ఫోన్ చేసి మరో పెళ్లి చేసుకోవాలని సూచించాడు. ఆ యువతికి ఫోన్ చేసి ‘నీది మహర్జాతకం’ అంటూ మభ్యపెట్టాలని చూశాడు. తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ నువ్వంటే ఇష్టం, నీకోసం ఏదైనా చేస్తానంటూ ఆఫర్ల ఇవ్వడం మొదలు పెట్టాడు. కానీ, ఆ యువతి తిరస్కరించినా అర్థరాత్రిళ్లు ఫోన్‌లు చేయడం మొదలు పెట్టాడు. ఇంటికి వస్తానంటూ టార్చర్ చేశాడు. కామవాంఛ తీర్చాలని కోరాడు.
రోజురోజుకూ ఫోన్‌లో వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు పూజారిని నిలదీశాయి. పూజారి వృత్తికి మచ్చతెచ్చేలా వ్యవహరించారని మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.