హైదరాబాద్‌లో రైల్వే ట్రాక్ కింద గోయ్యి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని పాతబస్తీ ఫలక్‌నుమా వద్ద రైల్వేట్రాక్ క్రింద బుధవారం భూమి కుంగి, గోయ్యి ఏర్పడింది. కరోనా కారణంగా రైళ్ల ప్రయాణికుల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోమ్‌గార్డ్‌లు పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హోంగార్డ్ సమయ స్ఫూర్తితో సమీప రైల్వే స్టేషన్‌లో ఆ పట్టాల నుంచి వస్తున్న గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. గోయ్యికి మరమ్మత్తులు చేయించిన […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని పాతబస్తీ ఫలక్‌నుమా వద్ద రైల్వేట్రాక్ క్రింద బుధవారం భూమి కుంగి, గోయ్యి ఏర్పడింది. కరోనా కారణంగా రైళ్ల ప్రయాణికుల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోమ్‌గార్డ్‌లు పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హోంగార్డ్ సమయ స్ఫూర్తితో సమీప రైల్వే స్టేషన్‌లో ఆ పట్టాల నుంచి వస్తున్న గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. గోయ్యికి మరమ్మత్తులు చేయించిన తర్వాత గూడ్స్ రైలును డిపించారు.