పాతబస్తీలో ఒమిక్రాన్ కలకలం.. మెదట కరోనా తర్వాత..

దిశ, చార్మినార్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ దుబాయ్​ నుంచి వచ్చిన 30 ఏండ్ల యువకుడికి సోకడంతో పాతబస్తీ వాసులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లో రెండు ఒమిక్రాన్​ కేసులు నమోదు కావడంతో టోలి చౌకి ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా గుర్తించిన విషయం విధితమే. ఈ నెల 13వ తేదీన దుబాయ్​ నుంచి ఎం.నాసర్​ (30) అనే యువకుడు దుబాయ్​ నుంచి పాతబస్తీ గురాన్​ గల్లీ పంజేషాలోని తన ఇంటికి వచ్చాడు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో చేసిన టెస్టుల్లో […]

Update: 2021-12-17 07:24 GMT

దిశ, చార్మినార్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ దుబాయ్​ నుంచి వచ్చిన 30 ఏండ్ల యువకుడికి సోకడంతో పాతబస్తీ వాసులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లో రెండు ఒమిక్రాన్​ కేసులు నమోదు కావడంతో టోలి చౌకి ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా గుర్తించిన విషయం విధితమే. ఈ నెల 13వ తేదీన దుబాయ్​ నుంచి ఎం.నాసర్​ (30) అనే యువకుడు దుబాయ్​ నుంచి పాతబస్తీ గురాన్​ గల్లీ పంజేషాలోని తన ఇంటికి వచ్చాడు.

శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో చేసిన టెస్టుల్లో పాజిటివ్ రావడంతో నాసర్​ తన ఇంటి మొదటి అంతస్థులో ఒక్కడే హోం క్వారంటైన్​లో ఉన్నాడు. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కార్పొరేట్ ​ఆసుపత్రి సౌజన్యంతో సంప్రదింప్రులు జరుపుకుంటూ నాసర్​ చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం వచ్చిన తాజా రిపోర్ట్​లో నాసర్​కు ఒమిక్రాన్​ కేసు నిర్దారణ కావడంతో గురువారం రాత్రి ఆ యువకున్ని పంజేషా నుంచి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ఆ యువకుడు ఉన్న ఇంటి పరిసరాలను హైప్రో క్లోరైట్ రసాయనాల ద్వారా శుద్ది చేశారు. పాతబస్తీలో ఒమిక్రాన్ తొలికేసు కావడంతో దారుల్​షిఫా యుహెచ్​పి ఆధ్వర్యంలో వైద్యశిభిరాన్ని నిర్వహించారు. 35 మందికి ఆర్​టిపీసిఆర్​ పరీక్షలు, 50 మందికి ర్యాపిడ్​ పరీక్షలు చేసినట్లు డాక్టర్​ రవళి తెలిపారు. నాసర్​ కుటుంబ సభ్యులలో ఎవరికి ఎలాంటి లక్షణాలు లేవని, ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు.

Tags:    

Similar News