ఆ ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్ ప్రకటించండి : కేంద్రం

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విలయతాడవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మినీ లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్‌లు ప్రకటించాలన్నది. ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని […]

Update: 2021-04-25 21:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విలయతాడవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మినీ లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్‌లు ప్రకటించాలన్నది. ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని తెలిపింది. 50 శాతంతోనే బస్సులు, రైళ్లు నడపాలని అలానే వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికే అనుమతించాలని తెలిపింది. రాష్ట్రాల్లోనూ, రాష్ట్రాల మధ్య అత్యవసర సరుకుల రవాణపై ఆంక్షలొద్దని పేర్కొంది.

Tags:    

Similar News