PJR అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ.. గంటలోనే మూడు ఫ్లాట్స్ లూటీ
దిశ, కాళోజి జంక్షన్: హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి పీజేఆర్ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఒకేసారి మూడుచోట్ల చోరీకి పాల్పడ్డ దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే… సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్‌మెంట్ వెనుకనుంచి సెక్యూరిటీ వైర్లను తొలగించి నలుగురు దొంగలు లోపలికి వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ప్లాట్‌లను ఎంచుకొని, తాళాలు పగులగొట్టి దొంగతనం చేశారు. 202 ప్లాట్‌లో ఉంటున్న విశ్రాంత ఆచార్యులు వెంకటాచలం నివాసంలో […]
దిశ, కాళోజి జంక్షన్: హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి పీజేఆర్ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఒకేసారి మూడుచోట్ల చోరీకి పాల్పడ్డ దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే… సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్‌మెంట్ వెనుకనుంచి సెక్యూరిటీ వైర్లను తొలగించి నలుగురు దొంగలు లోపలికి వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ప్లాట్‌లను ఎంచుకొని, తాళాలు పగులగొట్టి దొంగతనం చేశారు. 202 ప్లాట్‌లో ఉంటున్న విశ్రాంత ఆచార్యులు వెంకటాచలం నివాసంలో సుమారు రెండు కేజీల బంగారం, మూడు లక్షల నగదుతో పాటు కింది ప్లాట్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుమార్ ఇంట్లో రెండు తులాల బంగారం దోచుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.