నిలువెత్తు కామాంధుడు.. రెండు నెలల పసికందుపై అఘాయిత్యం

దిశ, వెబ్‌డెస్క్:  అప్పుడే పుట్టిన చిన్నారిని చూస్తే  ఎవరికైనా ఏమనిపిస్తోంది. ఆ ముద్దులొలికే బుగ్గలను పట్టుకొని గిల్లి, ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా పెంచాలనిపిస్తోంది. ఆ బోసి నవ్వులను చూస్తూ మైమరిచిపోవాలనిపిస్తోంది. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులకు మాత్రం ఆ పసికందు అమ్మాయి అయితే చాలు. రెండు నెలల పసికందు అని కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నరరూప రాక్షసుడు. తానూ  ఓ అమ్మ కడుపు నుంచే వచ్చానన్న విజ్ఞతను మరిచి రెండు నెలల పసికందుపై […]

Update: 2021-06-23 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే పుట్టిన చిన్నారిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తోంది. ఆ ముద్దులొలికే బుగ్గలను పట్టుకొని గిల్లి, ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా పెంచాలనిపిస్తోంది. ఆ బోసి నవ్వులను చూస్తూ మైమరిచిపోవాలనిపిస్తోంది. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులకు మాత్రం ఆ పసికందు అమ్మాయి అయితే చాలు. రెండు నెలల పసికందు అని కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నరరూప రాక్షసుడు. తానూ ఓ అమ్మ కడుపు నుంచే వచ్చానన్న విజ్ఞతను మరిచి రెండు నెలల పసికందుపై అఘాయిత్యానికి ఒడిగట్టి చిన్నారి ప్రాణం తీశాడు. మృగంలా మారి అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాకు చెందిన ఓ జంటకు రెండు నెలల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అదే గ్రామానికి చెందిన ఓ ముప్పయ్యేళ్ల వ్యక్తి కన్ను ఆ పసికందు మీద పడింది. ఎప్పటిలాగానే ఆ జంట సోమవారం రాత్రి బిడ్డను పడుకోపెట్టి వారు నిద్రపోయారు. అదే అదునుగా భావించిన వ్యక్తి అర్ధరాత్రి వారి ఇంట్లోకి దూరి బిడ్డను అపహరించుకుపోయాడు. సమీపంలో ఉన్న స్కూల్ భవనంలోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యచారానికి పాల్పడ్డాడు. ఉదయం చిన్నారి కనిపించకపోయేసరికి ఖంగుతిన్న తల్లిదండ్రులు చిన్నారి కోసం ఊరంతా వెతకడం మొదలుపెట్టారు.

చివరికి స్కూల్ భవనంలో తీవ్ర రక్తస్రావం మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గుర్తించారు. ఆ పరిస్థితిలో చిన్నారిని చూసిన తల్లి కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే బిడ్డ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేయగా.. నిందితుడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాలికి గాయం కావడంతో నిందితుడు కిందపడడంతో అతనిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇలాంటి నీచులను అందరి ముందు కాల్చి చంపాలని, వెంటనే ఉరి శిక్ష అమలుచేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News