దారుణం.. మంచంపట్టిన కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

దిశ, నల్లగొండ: మనుషులే కాదు.. నోరు లేని మూగజీవులు కూడా అమ్మపై ఎంతో ప్రేమను చూపుతాయి. ఎందుకంటే అమ్మ అంటే అందిరికీ ఇష్టమే. ఎవరికైనా అమ్మ తరువాతే ఎవరైనా. అమ్మ మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాడిని చేస్తుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మ వృద్ధురాలైనప్పుడు ఓ చంటి పిల్లలాగా చూసుకుంటూ సేవలు చేయాలి. కానీ, ఓ దుర్మార్గుడు మంచంపట్టిన తన తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. నల్లగొండ జిల్లాలో ఈ […]

Update: 2020-05-26 22:29 GMT

దిశ, నల్లగొండ: మనుషులే కాదు.. నోరు లేని మూగజీవులు కూడా అమ్మపై ఎంతో ప్రేమను చూపుతాయి. ఎందుకంటే అమ్మ అంటే అందిరికీ ఇష్టమే. ఎవరికైనా అమ్మ తరువాతే ఎవరైనా. అమ్మ మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాడిని చేస్తుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మ వృద్ధురాలైనప్పుడు ఓ చంటి పిల్లలాగా చూసుకుంటూ సేవలు చేయాలి. కానీ, ఓ దుర్మార్గుడు మంచంపట్టిన తన తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. నల్లగొండ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ(55) కొడుకు తిరుమల లింగస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్లాడు. తల్లి వ‌ృద్ధురాలు కావడంతో ఆమెను స్వగ్రామంలోనే ఉంచి హైదరాబాద్ కు వెళ్లాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో లింగస్వామి పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శాంతమ్మ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యల కారణంగా మంచం పట్టింది. ఈ క్రమంలో లింగస్వామి తన తల్లిని సాకలేకపోయాడు. మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న తల్లి శాంతమ్మపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. దీంతో శాంతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tags:    

Similar News