కూతురిపై అనుమానంతో చంపేశాడు..

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట మృత్యువుగా మారాడు. తన చెల్లెల్లానే కులాంతర వివాహం చేసుకుని ఇంటి పరువు తీస్తుందనే అనుమానంతో దారుణంగా హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌ దివాన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన సోదరి ఇటీవలే కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీన్ని అవమానకరంగా భావించిన సంతోష్.. కూతురు(18) కూడా ఏదో […]

Update: 2020-02-16 09:32 GMT

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట మృత్యువుగా మారాడు. తన చెల్లెల్లానే కులాంతర వివాహం చేసుకుని ఇంటి పరువు తీస్తుందనే అనుమానంతో దారుణంగా హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌ దివాన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన సోదరి ఇటీవలే కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీన్ని అవమానకరంగా భావించిన సంతోష్.. కూతురు(18) కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పనే చేస్తుందనే మూర్ఖమైన భావనకు వచ్చాడు. దీంతో ఆమె ఫోన్ చూసినా, బయటకు వెళ్లినా అనుమానించేవాడు. ఈ క్రమంలో సదరు యువతి ఫోన్ వాడటాన్ని సహించలేని తండ్రి, కూతురితో గొడవకు దిగాడు. అప్పటికే తండ్రి అతి అనుమానంతో మానసిక వేధనకు గురైన యువతి.. తండ్రితో గొడవకు దిగి బయటకు వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. ఆమె వెనకాలే వెళ్లి, బండరాయితో తలపై మోదాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణాలు విడిచింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారణ అదుపులోకి తీసుకుని చేపట్టారు.

Tags:    

Similar News