ఇంట్లో పడుకున్న వ్యక్తి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబీకులు

దిశ, శామీర్ పేట్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన జాప రాములు (79) మతిస్థిమితం  సరిగ్గా లేక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 16 వ తేదీన ఇంట్లో పడుకొని ఉన్న అతను ఉదయం లేచేసరికి కనిపించ లేదు. దీంతో బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికి చూడగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో […]

Update: 2021-12-18 08:15 GMT

దిశ, శామీర్ పేట్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన జాప రాములు (79) మతిస్థిమితం సరిగ్గా లేక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 16 వ తేదీన ఇంట్లో పడుకొని ఉన్న అతను ఉదయం లేచేసరికి కనిపించ లేదు. దీంతో బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికి చూడగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శనివారం శామీర్ పేట్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై గణేష్ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags:    

Similar News