అవయవదానానికి రాఘవులు అంగీకారం
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రముఖ సామాజిక వేత్త, బెస్ట్ సేవా సంస్థ వ్యవస్థాపకులు బుక్క ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుల్లారెడ్డి సూచన మేరకు నావంతు సహాయంగా నేత్రాలు, కిడ్నిలు, గుండె, లివర్, ఇవ్వడానికి కుటుంబసభ్యులతో సహా ఇష్టపూర్వకంగా సొసైటీకి అంగీకారపత్రం రాసి ఇచ్చాడు. అనంతరం […]
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రముఖ సామాజిక వేత్త, బెస్ట్ సేవా సంస్థ వ్యవస్థాపకులు బుక్క ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుల్లారెడ్డి సూచన మేరకు నావంతు సహాయంగా నేత్రాలు, కిడ్నిలు, గుండె, లివర్, ఇవ్వడానికి కుటుంబసభ్యులతో సహా ఇష్టపూర్వకంగా సొసైటీకి అంగీకారపత్రం రాసి ఇచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇతరులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమే అని తెలిపాడు. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.