రూ.కోటి వేతనంతో ఉద్యోగం.. పెళ్లైన వారే అర్హులు.. ఆ పనికోసమే!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఉద్యోగి ఆకర్షణీయమైన వేతనం రావాలని ఆకాంక్షిస్తాడు. మెరుగైన వేతనం వస్తుందంటే అప్పటి వరకు చేస్తున్న కంపెనీకి టాటా చెప్పేసి కొత్త కంపెనీకి షిఫ్ట్ అవుతారు. మరి వారానికి రెండు రోజుల సెలవు, కోటి వేతనం ఇస్తా అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆ ఉద్యోగ ప్రకటన చూసి వేలాది మంది తన అప్లికేషన్స్‌ను పంపుతున్నారు. ఇంతకూ ఆ ఉద్యోగం ఏంటీ? ఎవరు అర్హులు, ఎందుకు అంత వేతనాన్ని ఇస్తున్నారో తెలుసుకుందాం. కరోనా […]

Update: 2021-05-07 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఉద్యోగి ఆకర్షణీయమైన వేతనం రావాలని ఆకాంక్షిస్తాడు. మెరుగైన వేతనం వస్తుందంటే అప్పటి వరకు చేస్తున్న కంపెనీకి టాటా చెప్పేసి కొత్త కంపెనీకి షిఫ్ట్ అవుతారు. మరి వారానికి రెండు రోజుల సెలవు, కోటి వేతనం ఇస్తా అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆ ఉద్యోగ ప్రకటన చూసి వేలాది మంది తన అప్లికేషన్స్‌ను పంపుతున్నారు. ఇంతకూ ఆ ఉద్యోగం ఏంటీ? ఎవరు అర్హులు, ఎందుకు అంత వేతనాన్ని ఇస్తున్నారో తెలుసుకుందాం.

కరోనా కారణంగా ఓ సంపన్న జంట తన ఇద్దరు పిల్లలతో బహమస్ ద్వీపంలో సేదదీరాలనుకుంది. అయితే వారికి బహమస్‌తో పాటు నేపుల్స్, ఫ్లోరిడా వంటి నగరాల్లో బహుళ అంతస్థుల భవనాలున్నాయి. తమతో పాటు ఈ భవనాలన్నింటీ చూసుకోవడానికి ఒక పెళ్లైన జంట కావాలని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ జాబ్ పోర్టల్ పోలో అండ్ ట్వీడ్‌లో ఈ ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన జంట నేపుల్స్, ఫ్లోరిడా, బహమస్‌లలో ఉన్న వారి ఇళ్లలో పనిచేయాల్సి ఉంటుంది. అనుభవాన్ని బట్టి ఎంపికైన జంటకు సంవత్సరానికి $100,000- నుండి $ 120,000 (భారత కరెన్సీలో సుమారు రూ. 1 కోటికి పైగా) చెల్లిస్తారు. వేతనంతో పాటు హోటల్లో బస, హెల్త్ కేర్ సదుపాయాలు, కారు వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ఎంపికైన జంట సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. వీకెండ్స్‌లో ఎలాంటి పని ఉండదని సదరు జాబ్ పోర్టల్ పేర్కొంది.

ఈ ఉద్యోగ ప్రకటన చూసిన జంటలు భారీగా దరఖాస్తులు పంపుతున్నారు. వారానికి ఐదు రోజులు పని.. కోటికి పైగా వేతనం వస్తుండడంతో పోటీ ఎక్కువగా ఉన్నది. ఉద్యోగానికి ఎంపికైన జంట ఎస్టేట్ నిర్వహణ, కాంట్రాక్టర్లతో కలిసి పనిచేయడం, ఇంటిని శుభ్రపర్చడం, బాత్రూమ్ ఇతర ప్రాంతాలను శుభ్రపర్చడం, లాండ్రీ, ఇస్త్రీ వంటి పనులు వచ్చి ఉండాలని కోరింది. ఇక అతిథులను ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ చేయడానికి డ్రైవింగ్ వచ్చి ఉండాలని జాబ్ డిస్క్రిప్షన్లో వెల్లడించింది. మరి ఆ ఉద్యోగానికి ఎంపికయ్యే అదృష్టమంతులు ఎవరో చూడాలి మరి.

Tags:    

Similar News