ఆ శాఖలో భారీ కుంభకోణం.. రూ.7కోట్లు కొట్టేసిన ఇంటిదొంగలు

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.7కోట్ల నిధులను మత్స్యశాఖ ఉద్యోగులే కాజేశారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో ఇంటి దొంగలు గుట్టుగా డ్రా చేసేశారు. గతేడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మత్స్యశాఖలో శాఖాపరమైన ఆడిట్ చేస్తుండగా ఈ కుంభకోణం బయటపడింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా […]

Update: 2021-08-03 03:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.7కోట్ల నిధులను మత్స్యశాఖ ఉద్యోగులే కాజేశారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో ఇంటి దొంగలు గుట్టుగా డ్రా చేసేశారు. గతేడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మత్స్యశాఖలో శాఖాపరమైన ఆడిట్ చేస్తుండగా ఈ కుంభకోణం బయటపడింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు.

Tags:    

Similar News