వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ
దిశ, ఏపీ బ్యూరో: పది అడుగుల పొడవైన భారీ కొండచిలువని ఓ వ్యవసాయ బావి నుంచి గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం శుక్రవారం చాకచక్యంగా కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామం సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ ఉన్న విషయాన్ని గ్రమస్తులు గమనించారు. వెంటనే విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ, అటవీ శాఖకు సమాచారం అందజేశారు. సంస్థ సీఈఓ రమణ మూర్తి చాకచక్యంగా కొండచిలువను కాపాడారు. అనంతరం అటవీ అధికారుల సూచనమేరకు […]
దిశ, ఏపీ బ్యూరో: పది అడుగుల పొడవైన భారీ కొండచిలువని ఓ వ్యవసాయ బావి నుంచి గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం శుక్రవారం చాకచక్యంగా కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామం సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ ఉన్న విషయాన్ని గ్రమస్తులు గమనించారు.
వెంటనే విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ, అటవీ శాఖకు సమాచారం అందజేశారు. సంస్థ సీఈఓ రమణ మూర్తి చాకచక్యంగా కొండచిలువను కాపాడారు. అనంతరం అటవీ అధికారుల సూచనమేరకు కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.