మరణించిన భార్య కోసం ఏం చేశాడో చూడండి
దిశ,వెబ్‌డెస్క్: ప్రేమ అనేది వర్ణించలేనిది. కొందరు ప్రేమించిన వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు . ఇలాంటివి చరిత్రలో కూడా చూశాం. తన భార్య ముంతాజ్ పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జ్ఞాపకార్థంగా ఆనాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారు. షాహాజాన్ లానే మరో వ్యక్తి ఉన్నాడన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఈ అభినవ షాజహాన్ ఎవరు… ఆయన అసలు పేరేంటో తెలుసుకుందాం. మరణించిన తన భార్యకోసం ఓ […]
దిశ,వెబ్‌డెస్క్: ప్రేమ అనేది వర్ణించలేనిది. కొందరు ప్రేమించిన వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు . ఇలాంటివి చరిత్రలో కూడా చూశాం. తన భార్య ముంతాజ్ పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జ్ఞాపకార్థంగా ఆనాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారు. షాహాజాన్ లానే మరో వ్యక్తి ఉన్నాడన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఈ అభినవ షాజహాన్ ఎవరు… ఆయన అసలు పేరేంటో తెలుసుకుందాం.
మరణించిన తన భార్యకోసం ఓ అడవినే నాటాడు భర్త మార్టిన్ . ఆ అడవి కూడా భారీ గిటార్ ఆకారంలో ఉంటుంది. ఈ గిటార్ డిజైన్ అడవి వెనక ఓ విషాదం దాగి ఉంది. అర్జెంటీనాకు చెందిన రైతు మార్టిన్ అతని భార్య గ్రేసిలా. గ్రేసిలా నలుగురికి పిల్లలకు జన్మనిచ్చి ఐదో సారి గర్భవతిగాఉన్న సమయంలో అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణ భర్త మార్టిన్ ను కుంగదీసింది. ఆమె జ్ఞాపకాలనుంచి బయపడలేక ఏదైనా చేయాలని అనుకున్నాడు. భార్య గ్రేసిలాకు గిటార్ అంటే ప్రాణం. అంతే గిటార్ ఆకారంలో కిలోమీటర్ పొడవునా 7వేల మొక్కలతో అడవిని తయారు చేశాడు. దాదాపూ 2ఏళ్ల తరువాత అడవి పూర్తిగా గిటార్ ఆకారంలో తయారైంది. ఈ సందర్భంగా మార్టిన్ మాట్లాడుతూ స్వర్గంలో ఉన్న నా భార్య ఈ అడవిని చూస్తుందంటూ విచారం వ్యక్తం చేశాడు. ఎంతైనా గ్రేట్ కదా