ఇకపై రైళ్లలో మాస్కు లేకుంటే అంతే…

న్యూఢిల్లీ: మాస్కులు పెట్టుకోకుండా కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించే వారికి షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీన్ని రైల్వే యాక్ట్ కింద నేరంగా పరిగణించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్వర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రైల్వే స్టేషన్‌లలో ఉమ్మి వేయడం, మాస్కులు లేకుండా తిరగడాన్ని నేరంగా పరిగణించనున్నారు. మాస్కులు లేకుండా రైళ్లలో, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో తిరిగే వారికి రూ. 500 […]

Update: 2021-04-17 04:44 GMT

న్యూఢిల్లీ: మాస్కులు పెట్టుకోకుండా కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించే వారికి షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీన్ని రైల్వే యాక్ట్ కింద నేరంగా పరిగణించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్వర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రైల్వే స్టేషన్‌లలో ఉమ్మి వేయడం, మాస్కులు లేకుండా తిరగడాన్ని నేరంగా పరిగణించనున్నారు. మాస్కులు లేకుండా రైళ్లలో, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో తిరిగే వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు.

Tags:    

Similar News