కీచక డాక్టర్.. చెకప్ పేరుతో ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు. కామవాంఛలతో రగిలిపోయి కిరాతకులుగా మారుతున్నారు. వావి వరుసలు మారుస్తున్నారు.. గౌరవ వృత్తిలో ఉన్నామన్న విచక్షణ కూడా లేకుండా కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా  కామాంధులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. వీరి వలన ఆడవారు బయటకి రావడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలను కాపాడిల్సిన బాధ్యత కలిగినవారే ఇలాంటి అరాచకాలకు పాల్పడడం సమాజానికే సిగ్గుచేటు. తాజాగా ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన మహిళా రోగిని చికిత్స పేరుతో  […]

Update: 2021-09-28 00:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు. కామవాంఛలతో రగిలిపోయి కిరాతకులుగా మారుతున్నారు. వావి వరుసలు మారుస్తున్నారు.. గౌరవ వృత్తిలో ఉన్నామన్న విచక్షణ కూడా లేకుండా కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. వీరి వలన ఆడవారు బయటకి రావడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలను కాపాడిల్సిన బాధ్యత కలిగినవారే ఇలాంటి అరాచకాలకు పాల్పడడం సమాజానికే సిగ్గుచేటు. తాజాగా ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన మహిళా రోగిని చికిత్స పేరుతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని అసభ్యంగా తాకుతూ లైంగిక దాడికి యత్నించిన ఘటన గోవాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మవుసా పట్టణంలో ప్రసిద్ధ ఆర్థోపెడిక్ సర్జన్ క్లినిక్‌కు లేడీ అటెండెంట్ లేకుండా ఓ మహిళా రోగి ఒంటరిగా వచ్చింది. తుంటి నొప్పి ఉండడంతో చెకప్ చేయాలనీ చెప్పి మహిళను బెడ్ పై పడుకోపెట్టిన డాక్టర్ ఆమె ప్యాంట్ విప్పాలని కోరాడు. దీంతో ఆమె తుంటినొప్పి కాబట్టి అలా చేయమన్నాడు అనుకోని ప్యాంటు విప్పింది. ఆ తర్వాత చెకప్ పేరుతో ఆ డాక్టర్ ఆమె తొడలను తాకుతూ ఆమె ప్రైవేట్ భాగాన్ని తాకడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన మహిళ, డాక్టర్ ని నెట్టి బయటికి పరుగులు తీసింది. అనంతరం ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్నీ భర్తకు తెలపడంతో విషయం వెలుగుచూసింది. అంతకుముందు కూడా ఆ డాక్టర్ మహిళా రోగులతో అలాగే ప్రవర్తించాడని తెలియడంతో బాధిత మహిళ కీచక డాక్టరుపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కీచక డాక్టరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ గజానన్ ప్రభుదేశాయ్ చెప్పారు. కాగా నిందితుడైన డాక్టర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

Tags:    

Similar News