నారా లోకేష్‌పై క్రిమినల్ కేసు

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ సోషల్‌ మీడియా రాయదుర్గం ఇన్‌చార్జ్‌ మారుతిపై కర్ణాటకలో జరిగిన దాడిని ఖండించిన ఘటనలో నారా లోకేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అయితే.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా రాంపురంలో ఏప్రిల్ 21న జరిగిన దాడి ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి […]

Update: 2021-05-08 20:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ సోషల్‌ మీడియా రాయదుర్గం ఇన్‌చార్జ్‌ మారుతిపై కర్ణాటకలో జరిగిన దాడిని ఖండించిన ఘటనలో నారా లోకేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అయితే.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా రాంపురంలో ఏప్రిల్ 21న జరిగిన దాడి ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి ముడిపెడుతూ ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడంతో పాటు ఏపీలో అధికార పార్టీ వైసీపీని నష్టపరిచేందుకు కుట్ర చేశారంటూ లోకేష్‌పై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై 153ఏ, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో నారా లోకేష్‌పై పెట్టిన కేసులపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. వైసీపీ దొంగల ముఠా నాయకులు పెట్టే తప్పుడు కేసులకు సరైన రీతిలో సమాధానం చెప్పేరోజు దగ్గర్లలోనే ఉందని సూచించారు. ఈ మేరకు కాల్వ ఓ ప్రకటన విడుదల చేశారు. కాపు రామచంద్రారెడ్డి కాపు ప్రోద్భలంతోనే మారుతిపై దాడి జరిగినట్లు తాము బలంగా నమ్ముతున్నామన్నారు.

Tags:    

Similar News