కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన మహిళలపై దాడి.. HRCలో ఫిర్యాదు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఏప్రిల్ 12న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన విషయం తెలిసిందే. అయితే.. జిల్లాకు వచ్చిన మంత్రి సమస్యలు వివరించడానికి వచ్చిన మహిళలపై పోలీసులు దాడి చేయడంతో పాటు, వారి ఆధార్ కార్డులు, ఫిర్యాదు పత్రాలను చించి వేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్‌తో కలిసి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఏప్రిల్ 12న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన విషయం తెలిసిందే. అయితే.. జిల్లాకు వచ్చిన మంత్రి సమస్యలు వివరించడానికి వచ్చిన మహిళలపై పోలీసులు దాడి చేయడంతో పాటు, వారి ఆధార్ కార్డులు, ఫిర్యాదు పత్రాలను చించి వేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్‌తో కలిసి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మీడియాతో మాట్లాడుతూ… సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు మహిళలతో కలిసి తాను కూడా వెళ్లినట్టు తెలిపారు.
విధుల్లో ఉన్న పోలీసులు కేటీఆర్‌ను కలవనీయకుండా మహిళలపై దాడులు చేశారని, అకారణంగా తననూ అరెస్ట్ చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో పరిపాలన పాశవికంగా మారిందని, వరంగల్‌లోని లక్ష్మీపురంలో ఆరేళ్ళ క్రితం కేసీఆర్ ఇచ్చిన హామీలను అడగబోతే స్థానిక మహిళలని కూడా చూడకుండా పోలీసులు దాడి చేయడం అమానవీయమని దాసు సురేశ్ ఆరోపించారు. మహిళలను అడ్డుకుని దుర్భాషలాడడం, పత్రాలు చించివేయడం దారుణమని, ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని ఫిర్యాదు చేశారు.