ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు
దిశ, రాజేంద్రనగర్ : కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని 60 శాతానికి పైగా పారిపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది. నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి కి చెందిన మాణిక్యం (26) తన స్యట్రో (AP 09 R 3769) కారులో శంషాబాద్ వైపునుండి గచ్చిబౌలి వైపు వస్తుండగా నార్సింగ్ […]
దిశ, రాజేంద్రనగర్ : కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని 60 శాతానికి పైగా పారిపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది. నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి కి చెందిన మాణిక్యం (26) తన స్యట్రో (AP 09 R 3769) కారులో శంషాబాద్ వైపునుండి గచ్చిబౌలి వైపు వస్తుండగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రాగానే కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొంది.
దీంతో ఒక్కసారిగా కారులో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకవచ్చే సరికి మంటల్లో చిక్కుకున్న మాణిక్యం60 శాతానికిపైగా కాలిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు.