భూమిపై ఆక్సిజన్ అయిపోతుందా?
దిశ వెబ్‌డెస్క్ :ప్రస్తుతం భూమిపై సరిపోయేంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అందుకే మానవులు, జంతువులు, పక్షులు, కీటకాలు బ్రతకగలుగుతున్నాయి. ఇక ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లే కాదు… అసలు భూమిపై ఆక్సిజన్ ఉండదా?..మిలియన్ సంవత్సరాలకు భూమిపై ఆక్సిజన్ అయిపోతుందా?.. వాతావరణంలో ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోతుందా?. భూమిపై అసలు ఇక ఏ జీవీ ఉండదా?.. తినడానికి ఆహారం ఉండదా? టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన కజుమి ఓజాకి, జార్జియా టెక్‌కు చెందిన […]
దిశ వెబ్‌డెస్క్ :ప్రస్తుతం భూమిపై సరిపోయేంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అందుకే మానవులు, జంతువులు, పక్షులు, కీటకాలు బ్రతకగలుగుతున్నాయి. ఇక ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లే కాదు… అసలు భూమిపై ఆక్సిజన్ ఉండదా?..మిలియన్ సంవత్సరాలకు భూమిపై ఆక్సిజన్ అయిపోతుందా?.. వాతావరణంలో ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోతుందా?. భూమిపై అసలు ఇక ఏ జీవీ ఉండదా?.. తినడానికి ఆహారం ఉండదా?
టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన కజుమి ఓజాకి, జార్జియా టెక్‌కు చెందిన క్రిస్ రీన్‌హార్డ్ నిర్వహించిన రీసెర్చ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. భవిష్యత్‌లో భూమిపై వాతావరణ పరిస్థితులను ఈ రీసెర్చ్ ద్వారా అంచనా వేయగా.. కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడ్డాయి. పది వేల సంవత్సరాలకు భూమిపై ఇప్పటికంటే వాతావరణంలో ఆక్సిజన్ లెవల్స్ భారీగా తగ్గిపోతాయని తేలింది.
సౌర వ్యవస్థ దాని జీవిత చక్రాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక బిలియన్ సంవత్సరాలలో సూర్యుడు వేడెక్కుతాడని, దాని వల్ల వాతావరణం వేడి అవ్వడం వల్ల గాలిలోని కార్బన్ డయాక్సైడ్ విచ్ఛిన్నం అవుతుందని సైంటిస్టులు అంచనా వేశారు. దీని వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని, దాంతో చెట్లకు కార్బన్ డయాక్సైడ్ లభించక చనిపోతాయని అంచనా వేశారు. దాని వల్ల భూమిపై ఆక్సిజన్ కూడా తగ్గుతుందని రీసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
చెట్లు గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కానీ కార్బన్ డయాక్సైడ్ లభించక చెట్లు చనిపోతే ఆక్సిజన్ దొరకకపోవడమే కాదు.. తినడానికి ఆహారం కూడా ఉండదని సైంటిస్టులు అంచనా వేశారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని, చెట్లను పెంచాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.