ఆ అమ్మాయి జీవితం పాడు చేస్తానేమో అనే భయం కలుగుతున్నది
నా వయసు 27 సంవత్సరాలు. నాకు చాలా ఏళ్ల నుంచీ హస్తప్రయోగపు అలవాటుంది. ఇంట్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు.
డాక్టర్ గారూ... నా వయసు 27 సంవత్సరాలు. నాకు చాలా ఏళ్ల నుంచీ హస్తప్రయోగపు అలవాటుంది. ఇంట్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ స్త్రీతో శృంగారంలో పాల్గొనలేదు. కానీ ఈ మధ్య నాకు అంగస్తంభన పూర్తి స్థాయిలో కావడంలేదు. ఎందుకు నా అలవాటే దానికి కారణమా? గతంలో మద్యం అలవాటుంది. కానీ ఇప్పుడు మానేశాను. నాకు భయంగా ఉంది. పెళ్లి చేసుకునే అర్హత నాకు ఉందా... అమ్మాయి జీవితం పాడు చేస్తానేమో అనే భయం కలుగుతున్నది. నేనేం చేయాలి చెప్పండి. -నర్సిం, మంచిర్యాల
హస్తప్రయోగానికి(Manipulation), అంగస్తంభన(Erectile Dysfunction) లోపానికి అంటే Erectile Dysfunction కి(ED/ఈడీ ) సంబంధం లేదు. మరీ హస్తప్రయోగం ఒక మానసిక అబ్సెషన్ గా మారితే తప్ప అంటే రోజుకు పదుల సంఖ్యలో చేసుకునే అలవాటు వలన హెచ్.పీ చేస్తే తప్ప అంగం గట్టిపడని మనోలైంగిక సమస్యకి వెళ్లిపోయే స్థితి అరుదుగా కొద్ది మందిలో ఉంటుంది. ఇక అంగం గట్టి పడకపోవడానికి శారీరిక కారణాలు చాలా ఉంటాయి. బీ.పీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, కోలేష్ట్రాల్ అధికంగా ఉండడం, వరిబీజం, లివర్, కిడ్నీ సమస్యలు, రక్తనాళాల్లో సమస్యలు, సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడం, సిగరెట్, ఆల్కహాల్, గుట్కా అలవాట్లు, తీవ్రమైన మానసిక సమస్యలు.. సెక్స్ విషయంలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ , భయానికి లోనవడం, ఆత్మనూన్యత లాంటి వాటివలన కూడా రక్త సరఫరా సరిగ్గా కాక అంగస్తంభన లోపం ఏర్పడవచ్చు.
ఇంత చిన్న వయసులో నీకు నేను చెప్పిన పై జబ్బులు ఉండే అవకాశం లేదు. కానీ చెప్పలేము కాబట్టి ఒకసారి ఈడీ ప్రొఫైల్ చేయించుకోవాలి. దీనివల్ల వ్యాధి నిర్ధారణ జరిగి సరైన చికిత్స అందుతుంది. మద్యం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పూర్తిగా మానెయ్యి. ఇక పెళ్లికి ముందు పనికిస్తానో లేదో అని పరీక్షించుకుందామని సెక్స్ సంబంధాల్లోకి వెళితే... శీఘ్రస్ఖలన సమస్య ...ఈడీ అంటే అంగ స్తంభన సమస్యతో పాటు, అన్నిరకాల సుఖవ్యాధులు, దాంతో పాటు ప్రాణాంతకమైన హెచ్.ఐ.వీ వ్యాధి రావచ్చు. పెళ్లయ్యాక నీ భార్యకు అంటవచ్చును. పెళ్లి, సెక్స్ రెండూ విలువలతో కూడిన సామాజిక బాధ్యతలని గుర్తు పెట్టుకో. తరువాత హస్తప్రయోగానికి, ఈడీకి సంబంధం ఉందని అశాస్త్రీయమైన అపోహను పోగొట్టుకోలేకపోతే అదే నీలో సెక్స్ సమస్యలు సృష్టిస్తుంది. ముందు నువ్వు ఒక మంచి సెక్స్ కౌన్సెలర్‌ను కలవు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్