నా వయసు 22 సంవత్సరాలు.. టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనవచ్చా?

Update: 2024-10-22 13:36 GMT

నా వయసు 22. నా భర్త వయసు 32. పెళ్లయ్యి తొమ్మిదేళ్లయ్యింది. ఇంతవరకు పిల్లలు లేరు. రెండేళ్ల క్రితం నెల తప్పాను. కానీ మూడో నెల వచ్చాక డాక్టర్ పరీక్షించి పిండం ఎదుగుదల లేదని, అబార్షన్ చేయాలని లేకపోతే గర్భసంచికి నష్టం కలుగుతుందన్నారు. దాంతో అబార్షన్ చేయించుకున్నాను. అప్పటినుంచీ హాస్పిటల్‌కు వెళ్తూనే ఉన్నాను. ట్యూబ్ టెస్ట్ చేసి గర్భసంచికి సంబంధించిన ఓ సమస్య ఉందన్నారు. మా ఆయనకు కూడా ఏదో సమస్య ఉందన్నారు. ఎనిమిది నెలల నుంచీ మందులు వాడుతున్నా లాభం లేదు. ఏం చేయాలి? టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనవచ్చా? సలహా చెప్పండి.

టెస్ట్ ట్యూబ్ ద్వారా మీకు తప్పకుండా పిల్లల్ని కనవచ్చు. మీ ఇద్దరికీ సమస్య ఉంది. మీవారి సమస్యేంటో చెప్పలేదు. పైగా పెళ్లయ్యి తొమ్మిదేళ్ళయ్యింది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఏదైనా మంచి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లండి. డాక్టర్‌తో అన్ని విషయాలూ చర్చించి, వారి సలహా తీసుకోండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Tags:    

Similar News

Mr. మొహ‌మాటం.!