IPL 2025: ‘ఈ సాలా కప్ నమ్దే’అనొద్దని కోహ్లీ చెప్పాడు : ఏబీ డివిలియర్స్

Update: 2025-03-18 18:54 GMT
IPL 2025: ‘ఈ సాలా కప్ నమ్దే’అనొద్దని కోహ్లీ చెప్పాడు : ఏబీ డివిలియర్స్
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ‘ఈ సాలా కప్ నమ్దే’ ఇది ఆర్సీబీ నినాదం. ‘ఈ సంవత్సరం కప్పు మనదే’ అని దాని అర్థం. ప్రతి సీజన్ ఆరంభంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ జట్టును ఉత్సాహపరుస్తారు. అయితే, ఈ సీజన్‌లో ఆ స్లోగన్‌‌ను ఉపయోగించొద్దని ఆర్సీబీ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడట. ఈ విషయాన్ని ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డివిలియర్స్ మాట్లాడుతూ..‘ఇటీవల నేను ఆ స్లోగన్‌‌ను చెప్పాను. కోహ్లీ నుంచి డైరెక్ట్‌గా నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు అలా చెప్పడం ఆపండి అని మెసేజ్ చేశాడు. నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా. ఐపీఎల్‌లో 10 వరల్డ్ క్లాస్ జట్లు పోటీపడుతుంటాయి. వరల్డ్ కప్ కూడా గెలిచే సామర్థ్యం ఉన్న జట్లవి. కాబట్టి, ఐపీఎల్ చాలా కష్టతరమైన టోర్నీ. ఇది 18వ సీజన్. కోహ్లీ జెర్సీ నం.18. ఆర్సీబీ ఈ సారి విజేతగా నిలిస్తే విరాట్‌తో కలిసి టైటిల్ లిఫ్ట్ చేయడానికి నేను అక్కడే ఉంటా.’ అని డివిలియర్స్ తెలిపాడు. కాగా, ఆర్సీబీ తరపున డివిలియర్స్ 2011-2021 వరకు ప్రాతినిధ్యం వహించాడు.


Tags:    

Similar News