IPL-2025: ఫస్ట్ మ్యాచ్‌లోనే దంచికొట్టిన KKR బ్యాటర్స్.. RCB టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2025(IPL-2025)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కేకేఆర్(KKR) బ్యాటర్లు అదరగొట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025(IPL-2025)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కేకేఆర్(KKR) బ్యాటర్లు అదరగొట్టారు. ఒకరిద్దరు మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశారు. దీంతో మొత్తంగా కేకేఆర్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక ఆర్సీబీ(RCB) బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా, హేజల్ వుడ్ రెండు, రసిక్ దర్ సలామ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.