IPL 2025 : టీ20 క్రికెట్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నయా రికార్డు.. టీమిండియానే వెనక్కి నెట్టింది

ఐపీఎల్‌-2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది.

Update: 2025-03-23 12:43 GMT
IPL 2025 : టీ20 క్రికెట్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నయా రికార్డు.. టీమిండియానే వెనక్కి నెట్టింది
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌-2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలిసారిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ తనదైన విజృంభించాడు. అజేయ శతకంతో కదం తొక్కాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 రన్స్ చేశాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ తరపున శతకం బాదిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు.

మరోవైపు, ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్లాసెన్(34), నితీశ్ రెడ్డి(30), అభిషేక్ శర్మ(24) మెరుపులు మెరిపించారు. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో హయ్యెస్ట్ స్కోరు. అత్యధిక స్కోరు చేసిన రికార్డు కూడా ఎస్‌ఆర్‌హెచ్‌పైనే ఉంది. గత సీజన్‌లో ఆర్సీబీపై 287/3 స్కోరు చేసిన విషయం తెలిసిందే.

విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ తాజా ఇన్నింగ్స్‌తో నయా రికార్డు నెలకొల్పింది. ఏకంగా టీమిండియా రికార్డునే బద్దలు కొట్టింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250 స్కోరుకుపైగా చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సార్లు 250+ స్కోర్లు నమోదు చేసి ఈ ఘనత సాధించింది. టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే చెరో మూడు సార్లు 250+ స్కోర్లు చేశాయి. మరోవైపు, ఐపీఎల్‌లో టాప్-3 అత్యధిక స్కోర్లు హైదరాబాద్ పేరిటే ఉండటం విశేషం. గత సీజన్‌లో బెంగళూరుపై 287/3, రాజస్థాన్‌పై 286/6, గతేడాది ముంబైపై 277/3 స్కోరు చేసింది.

Tags:    

Similar News