తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన SRH ప్లేయర్ క్లాసెన్
దక్షిణాఫ్రికా ప్లేయర్, SRH బ్యాటర్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా ప్లేయర్, SRH బ్యాటర్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వార్నర్, విలియమ్సన్ తర్వాత హైదరాబాద్ అభిమానులు.. అదే రేంజ్‌లో క్లాసెన్‌ను కూడా ఓన్ చేసుకున్నారు. తనదైన ఆట తీరుతో జట్టుకు క్లాసెన్ అనేక విజయాలు అందించారు. అయితే, ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో క్లాసెన్ చెప్పిన విషెస్ అందరినీ ఆకట్టుకుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని క్లాసెన్ తెలుగులో చెప్పడం ఆసక్తిగా మారింది. క్లాసెన్ విషెస్‌కు ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా క్యూట్‌గా చెప్పావని కొందరు.. హైదరాబాద్‌లోనే స్థిరపడిపో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.