క్రికెట్ అంటే ఏమిటి? అని అడిగేవారు : యువరాజ్ సింగ్

అమెరికన్లు తనను కలిసిన ప్రతిసారి క్రికెట్ అంటే ఏమిటి? అని అడిగేవారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు.

Update: 2024-06-01 13:59 GMT

దిశ, స్పోర్ట్స్ : అమెరికన్లు తనను కలిసిన ప్రతిసారి క్రికెట్ అంటే ఏమిటి? అని అడిగేవారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌కు అతను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యువరాజ్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘అమెరికాలో క్రికెట్ ఆడతారని ఊహించలేదు. చాలా ఉత్సాహంగా ఉంది. ఐసీసీ కొత్త స్టేడియాలను నిర్మించింది. అమెరికా ప్రజలు క్రికెట్ చూడాలని కోరుకుంటున్నా.’ అని తెలిపాడు. అమెరికన్లు తనను క్రికెట్ అంటే ఏమిటి? అని అడిగేవారని, అప్పుడు వాళ్లకు తాను బేస్‌బాల్ లాంటిదేనని వివరించేవాడినని చెప్పాడు. అమెరికాలో బేస్ బాల్‌ అత్యంత ఆదరణ పొందిన క్రీడ. ఈ షోలో యువీ బేస్ బాల్‌కు, క్రికెట్‌కు మధ్య వ్యత్యాసాలను వివరించాడు. 


Similar News