చరిత్ర సృష్టించిన కోహ్లీ.. వరల్డ్ కప్‌ల్లో ఏకైక బ్యాటర్‌గా రికార్డు

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.

Update: 2024-06-22 17:18 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌ చరిత్రలో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్-8 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. పొట్టి ప్రపంచకప్‌లో ఫామ్‌ లేమితో సతమతమైన కోహ్లీ బంగ్లాపై సత్తాచాటాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌ల్లో 67 ఇన్నింగ్స్‌ల్లో అతను 61.26 సగటుతో 3,002 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


Similar News