గత ఆరు నెలలుగా వేధిస్తున్న భాద ఈ రోజు తొలిగిపోయింది: హర్దిక్ పాండ్యా
2024 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా భారత జట్టు అవతరించింది. ఓ వైపు సౌతాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డి కాక్ భారీ షాట్లతో రెచ్చిపోతున్న క్రమంలో భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు.
దిశ, వెబ్‌డెస్క్: 2024 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా భారత జట్టు అవతరించింది. ఓ వైపు సౌతాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డి కాక్ భారీ షాట్లతో రెచ్చిపోతున్న క్రమంలో భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ ప్రదర్శనతో క్లాసెన్ ను అవుట్ చేసి భారత్ ను తిరిగి గేమ్ లోకి తీసుకొచ్చాడు. అలాగే మరో భారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను కూడా అవుట్ చేయడంతో భారత విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్ విజయం అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన పాండ్యా.. గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం భారత జట్టుతో పాటు తనకు ఎంతో అవసరం అని.. కొన్ని కారణాలు, కొంతమంది వలన నేను గత 6 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడ్డానని, ఈ ఆరు నెలల నుంచి తాను దిగమింగుకున్న భాద ఈ విజయంతో కన్నీరుగా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. పాండ్యా తనను ట్రోల్ చేసిన వారితోనే ప్రసంశలు కురిపించుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.