టీమ్ ఇండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది.

Update: 2024-06-18 13:23 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గాయమైంది. రెండో రౌండ్ కోసం భారత ఆటగాళ్లు బార్బడోస్‌కు చేరుకున్నారు. గురువారం భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌కు ముందు సోమవారం భారత ఆటగాళ్లు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నారు.

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యకుమార్ చేతికి బంతి బలంగా తాకింది. దీంతో అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. ఫిజియో ట్రీట్‌మెంట్ తర్వాత సూర్య తన బ్యాటింగ్ సెషన్‌ను పూర్తి చేశాడు. అయితే, సూర్య గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై బీసీసీఐగానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌గానీ ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అఫ్ఘాన్‌తో మ్యాచ్‌‌లో అతను బరిలోకి దిగడంపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ సూర్యకు విశ్రాంతినిస్తే.. సంజూ శాంసన్‌‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Similar News