ఆస్ట్రేలియాపై భారత్ ట్యాంపరింగ్ చేసి గెలిచింది: పాక్ మాజీ కెప్టెన్

2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు దారుణంగా ఓడిపోయి సెమీస్ రేసు నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-26 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు దారుణంగా ఓడిపోయి సెమీస్ రేసు నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా భారత్ ప్రస్తుతం మూడుకు, మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీస్ చేరుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 24న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని ఆరోపించారు. దీనికి వివరణగా.. 16వ ఓవర్ వేసిన ఆర్స్ దీప్ కొత్త బంతిని ఎలా రివర్స్ స్వింగ్ చేయగలడని, అంటే బంతి 12, 13వ ఓవర్లోనే బంతి రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా మారిందా అంటూ ప్రశ్నించారు. అలాగే మ్యాచుల్లో అంపైర్లు కళ్లు తెరిచి ఉండాలని సూచించారు. ఈ నెల 24న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచులో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి ఆ జట్టుపై పగ తీర్చుకుంది. ఇదిలా ఉంటే 2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు 4 మ్యాచులకు గాను రెండింట్లో మాత్రమే విజయం సాధించి.. గ్రూప్ స్టేజీ నుంచే ఎలిమినేట్ అయింది. 

Similar News