ICC T20 World Cup: సెమీస్‌కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. కెప్టెన్ రషీద్‌‌ ఖాన్‌కు విదేశాంగ మంత్రి ఫోన్

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్-2024 ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంచనాలకు మించి అదరగొడుతోంది.

Update: 2024-06-25 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్-2024 ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంచనాలకు మించి అదరగొడుతోంది. లీగ్ స్టేజ్‌లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. మొన్నటికి మొన్న సూపర్-8లో విభాగంలో వన్డే ప్రపంచ కప్ విన్నర్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఆ జట్టు తాజాగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో నాకౌట్ స్టేజ్‌కు వెళ్లకుండానే ఆసిస్ ఇంటి దారిపట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాతో మ్యాచ్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అభినందించారు. ఏకంగా రషీద్ గ్రౌండ్‌లో ఉండగానే వీడియో కాల్ చేసి చాలాబాగా ఆడారంటూ ఆటగాళ్లలో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పోస్ట్ ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Similar News