T-20 వరల్డ్ కప్: అదరగొట్టిన టీమిండియా .. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్

టీ-20 ప్రపంచకప్‌ సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సమిష్టి‌గా రాణించారు. బ్యాటర్స్ రాణించడంతో

Update: 2024-06-22 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 ప్రపంచకప్‌ సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సమిష్టి‌గా రాణించారు. బ్యాటర్స్ రాణించడంతో బంగ్లా ముందు భారత్ భారీ టార్గెట్ పెట్టింది. నార్త్ సౌండ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 196 పరుగులు చేసింది. టీమిండియాకు ఓపెనర్స్ రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (37) శుభారంభం అందించారు. ఈ వరల్డ్ కప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి రాణించాడు. 24 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ (6) నిరాశ పర్చగా.. చివర్లో వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే పరుగుల వరద పారించారు. వైస్ కెప్టెన్ పాండ్యా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (50) చేయగా.. దూబే (34) రన్స్ చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించారు. బంగ్లా బౌలర్లలో హసన్ షకీబ్, రషీద్ హోస్సెన్ చెరో రెండు వికెట్ల తీయగా.. షకీబ్ ఒక వికెట్ సాధించాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంగా బంగ్లా ఛేదనకు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే దాదాపుగా సెమీస్‌కు వెళ్లినట్లే. దీంతో ఎలాగైనా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.


Similar News