ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మ్యాచ్ వర్షార్పణం
టీ20 వరల్డ్ కప్‌లో వరుణుడు ఖాతా తెరిచాడు. మంగళవారం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో వరుణుడు ఖాతా తెరిచాడు. మంగళవారం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే బార్బడోస్‌లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ప్రారంభమవడానికి ఆలస్యమైంది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండు ఇన్నింగ్స్‌లను 10 ఓవర్లకు కుదించారు. 10 ఓవర్లలో స్కాట్లాండ్ వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. జార్జ్ మున్సే(41 నాటౌట్), మైఖేల్ జోన్స్(45 నాటౌట్) అజేయంగా నిలిచారు. డీఎల్ఎస్ పద్ధతిలో ఇంగ్లాండ్ గెలుపొందాలంటే 10 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే మళ్లీ వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.