సౌతాఫ్రికా డబుల్ హ్యాట్రిక్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు

టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అదరగొడుతున్నది.

Update: 2024-06-21 18:24 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అదరగొడుతున్నది. వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసింది. సూపర్-8 రౌండ్‌లో వరుసగా రెండో గెలుపు సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకున్నది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 163/6 స్కోరు చేసింది. డికాక్(65), డేవిడ్ మిల్లర్(43) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ 156/6 స్కోరుకే పరిమితమైంది. హ్యారీ బ్రూక్(53), లివింగ్‌స్టోన్(33) పోరాటం వృథా అయ్యింది. మహరాజ్(2/25), రబాడా(2/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు


Similar News