AFG Vs SA : సెమీఫైనల్‌లో పీకల్లోతు కష్టాల్లో అఫ్గానిస్తాన్.. తక్కువ స్కోరుకే ఆలౌట్
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై సూపర్ విక్టరీలతో సెమీ ఫైనల్ చేరిన అఫ్గానిస్తాన్ సెమీస్‌లో తడబడింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై సూపర్ విక్టరీలతో సెమీ ఫైనల్ చేరిన అఫ్గానిస్తాన్ సెమీస్‌లో తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ జట్టు.. సఫారీ పేసర్ల ధాటికి విలవిలలాడారు. జాన్సెన్ 3, షంసీ 3, రబాడ 2, నోర్ట్జే 2 వికెట్లు తీసుకున్నారు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 10 పరుగులు చేసి అఫ్గాన్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం ఎక్స్ ట్రాల రూపంలో 13 పరుగులు రావడం గమనార్హం.