T20 ప్రపంచకప్‌ వేళ ధ్వంసమైన క్రికెట్ మైదానం

ప్రపంప వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది.

Update: 2024-05-30 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంప వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్, USA సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. తొలి దశలో ఒక్కో జట్టు 4 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. దీని తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు జరగనుండగా, ఈ మ్యాచ్‌ల్లో విజయం నమోదు చేసే జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు ఆతిథ్య దేశాలకు వెళ్లి ప్రాక్టీస్ షురూ చేశాయి. టీమిండియా కూడా యూఎస్ వెళ్లి సాధన ప్రారంభించింది. ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను బీసీసీఐ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. అయితే ఇదిలా ఉండగా.. మూడ్రోజుల్లో వరల్డ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ మైదానం ధ్వంసమైంది. భారీ వర్షం, తీవ్రమైన గాలుల కారణంగా మైదానంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ ధ్వంసం కావడంతో పాటు, మైదానం పైకప్పు కూడా భారీగా డ్యామేజ్ అయింది. దీంతో ఆ మైదానంలో జరుగాల్సిన వామప్ మ్యాచులను నిర్వాహకులు రద్దు చేశారు. ధ్వంసమైన మైదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



 



Tags:    

Similar News